జర్నలిస్ట్ వనం భాస్కర్ కు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

25-09-2026 | 09:24pm

హనుమకొండ, సెప్టెంబర్ 25(విజయ క్రాంతి): అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్(Senior Journalist Vanam Bhaskar) మృతదేహానికి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, పలువురు జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వనం భాస్కర్ కుటుంబానికి ప్రెస్  క్లబ్ నుండి 25వేల రూపాయల ఆర్థికసహయం(Financial assistance) అందించారు.

అనంతరం అధ్యక్షుడు వేముల నాగరాజు మాట్లాడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆ కుటుంబానికి క్లబ్ నుండి 20వేల ఆర్థిక సాయం అందించడం జరిగిందనీ, భాస్కర్ మృతి దురదృష్టకరమని, వారి కుటుంబానికి అండగా ప్రెస్ క్లబ్ తరఫున అండగా ఉంటామని అన్నారు.

 నివాళులర్పించిన వారిలో సీనియర్ జర్నలిస్ట్ కొరుకొప్పుల నరేందర్,మట్ట దుర్గాప్రసాద్, ప్రెస్ క్లబ్ ఈసీ సభ్యులు ఎండీ నయీంపాషా, కమటం వేణు గోపాల్, సీనియర్ జర్నలిస్టులు దాసరి శ్రీనివాస్, అడుప మహేష్, జన్ను స్వామి, కందుల శ్రీధర్, పెరుమాండ్ల మధు, బండి రవి, మోహన్, చినబాబు, నీలం శివ, ఉమాశంకర్, పాషా, అక్రం, రాజేశ్, శ్యాం, గంగరాజు, కృష్ణాకర్, సాయి, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు