విద్యార్థి దశ నుండి వంటకాలలో నైపుణ్యం
సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ముదిగొండ రాజు
కల్వకుర్తి అక్టోబర్ 1 : విద్యార్థులు చదువుతోపాటు వంటకాల్లో నైపుణ్యం పెంపొందించుకొని ఆరోగ్యకరమైన భోజనాన్ని తీసుకోవాలని సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి ముదిగొండ రాజు(Senior Civil Court Judge Mudigonda Raju) అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్ లో ఆయన పాల్గొని ని మాట్లాడారు .సంప్రదాయ వంటకాల ప్రాధాన్యతను తెలియజేయడం, స్వయంగా వంటలు తయారు చేసుకునే నైపుణ్యాన్ని పెంపొందించడం భవిష్యత్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, ఆహారంపై అవగాహన పెంచుతాయని తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన వివిధ వంటకాలను పరిశీలించారు.
అనంతరం న్యాయమూర్తిని కళాశాల ప్రిన్సిపల్ శార్వాణి, అధ్యాపకులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గౌడ్, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ రాజు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ శ్రీమతిబాయి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.