కరత్వాడ ప్రాజెక్ట్ నుండి నీటి విడుదల

01-10-2026 | 10:01pm

బోథ్. అక్టోబర్ 1( విజయక్రాంతి) మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు(Karathwada Project ) కుడి ఎడమ కాలువల మళ్ళి గురువారం  ఈ ఈ భూక్య భీమ్రావు ఏఈఈ జాదవ్ ప్రకాష్ నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

ఎల్ నినోప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు ఏమాత్రం పెరగలేదు అన్నారు. అయితే ఈ నెల 10 వరకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు. ఆ తర్వాత మరొక నీటిని విడుదల చేస్తామన్నారు. అయితే రైతులు రెండవ పంట వేయవద్దని ఆయాకట్టుకు నీటి విడుదల చేయలేమన్నారు. ఈ విషయాన్ని గమనించి రైతులు రెండవ పంట వేయవద్దన్నారు. నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని వారు కోరారు.

మరిన్ని వార్తలు