కత్తి రమేష్‌కు మంత్రి పొన్నం అభినందన

16-09-2026 | 03:31pm

బెజ్జంకి: కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) బెజ్జంకి పట్టణ అధ్యక్షుడిగా నూతనంగా నియమితులైన కత్తి రమేష్‌ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌(Minister Ponnam Prabhakar)ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ కత్తి రమేష్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వీరితో  పీసీసీ సోషల్ మీడియాలో రాష్ట్ర కార్యదర్శి దోనె వెంకటేశ్వర్ రావు, మానాల రవి,రమేష్,వేణు లు ఉన్నారు .

మరిన్ని వార్తలు