దానంపై హైకోర్టు తీర్పులో కీలకాంశాలు

19-09-2026 | 07:09am
  1. దానం అనర్హతపై 91 పేజీలతో అర్డర్‌ కాపీ విడుదల 
  2. ఈసీ, స్పీకర్‌కు హైకోర్టు నుంచి ఆర్డర్‌ కాపీలు 
  3. ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ

హైదరాబాద్: ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై( MLA Danam Nagender) అనర్హతపై అర్డర్‌ కాపీ(Order Copy) విడుదలైంది. తెంలగాణ హైకోర్టు(Telangana High Court) 91 పేజీలతో ఆర్డర్‌ కాపీని విడుదల చేసింది. దానంపై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ తరుపుణ ఎంపీగా పోటీ చేయడం ఫిరాయింపేనని హైకోర్టు తేల్చిచెప్పింది. బీఆర్ఎస్(Bharat Rashtra Samithi ) సభ్యత్వాన్ని స్వచ్ఛంగా వదులుకున్నట్టేనని స్పష్టం చేసింది. 2024 అఫిడవిట్ తిరస్కరించలేని ఆధారమని కోర్టు సూచించింది.

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) బయట చర్యలపై పదో షెడ్యూల్ వర్తిస్తుంది. బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానన్న వాదనను కోర్టు తిరస్కరించింది. పార్టీ చర్యలు తీసుకోకపోయినా అనర్హత తొలిగిపోదని పేర్కొంది. మూడేళ్ల అసెంబ్లీ కాలం గడిచిపోయినందున హైకోర్టు కేసును మళ్లీ స్పీకర్ కు పంచలేదు. ఖైరతాబాద్ అసెంబ్లీ సీటు(Khairatabad Assembly seat) ఖాళీగా ఉందని ప్రకటిస్తూ ఈసీ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  దానం అనర్హత వేటుతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు.


మరిన్ని వార్తలు