సీఎం సొంత గడ్డలో కవితమ్మ గర్జన

20-09-2026 | 11:22am

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌(Kodangal)లో రాజకీయ వేడి పెరుగుతోంది.కొడంగల్ నియోజకవర్గంలో ఈరోజు ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ(Kosgi College) గ్రౌండ్‌లో సభ జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేశారు. కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

మరిన్ని వార్తలు