మండల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం

19-09-2026 | 01:02pm

కొడిమ్యాల, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల(Kodimyala) మండల కేంద్రంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(School Games Federation) ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. అండర్‌–14, అండర్‌–17 బాలబాలికల విభాగాల్లో వివిధ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను తదుపరి స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు