గణపతి సేవలో కేటీఆర్

24-09-2026 | 05:10am

n ఖైరతాబాద్, బాలాపూర్ మండపాల్లో పూజలు

n వర్షాలు బాగా పడాలి: కేటీఆర్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navaratri celebrations) సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) హైదరాబాద్‌లోని ప్రముఖ గణపతి మండపాలను బుధవారం సందర్శించారు. ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి(Khairatabad Sri Panchamukha Sankatahara Maha Ganapathi)తో పాటు బాలాపూర్ గణేషుడిని(Balapur Ganesh) దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు కేటీఆర్‌కు శాలువా కప్పి, ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఉన్నారు.

స్వామివారి దర్శనం అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ దేశమం తటా సమృద్ధిగా వర్షాలు కురవాలి, రైతాంగం ఆనందంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నగరం కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా శాంతిభద్రతలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ‘రాజకీయా లు ఎప్పుడూ ఉంటాయి, పండుగల సమయాల్లోనైనా వాటిని పక్కనబెట్టి కుటుంబసభ్యులతో ఆనందోత్సాహాల మధ్య సంతోషంగా ఉండాలి‘ అని పిలుపునిచ్చారు.  

అర్ధరాత్రి వరకు ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం

ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రా ల నుంచి కూడా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉండటంతో క్యూలైన్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అర్ధరాత్రి వరకు నిరంతరాయంగా దర్శనాలు కొనసాగేలా ఉత్సవ కమిటీ, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఖైరతా బాద్ పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ మార్గ్, ఐమ్యాక్స్ రోడ్డు మార్గాల్లో పోలీసులు భారీ గా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలు, షీ టీమ్స్, ప్రత్యేక నిఘా విభాగాల పర్యవేక్షణలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు