ఆశ్రితుని కర్తవ్యం
పాలకుర్తి రామమూర్తి :
లోకయాత్రావిత్
రాజానమ్ ఆత్మద్రవ్య ప్రకృతి
సంపన్నం ప్రియహిత
ద్వారేణ ఆశ్రయేత!
(కౌటిలీయం 5--4)
లోకవ్యవహారం తెలిసినవాడు, రాజుకు ప్రియుడు(Boyfriend), హితుడూ అయిన పురుషుని ద్వారా, ఆత్మ సంపన్నుడు అనగా అత్యున్నతమైన స్వభావం కలిగినవాడు, ద్రవ్య సంపన్నుడు అనగా ఆర్థిక వనరులు(Financial resources) కలిగినవాడు, ప్రకృతి సంపదపరంగా సమర్థుడైన రాజును ఆశ్రయించాలి. ప్రకృతి సంపన్నుడు అనేది ఒక సాంకేతిక పదం. చాణక్యుని అర్థశాస్త్రంలో ప్రకృతు లు అన్న పదం రాజ్యాన్ని నిలబెట్టే రాజు, మంత్రులు, జనపదం, దుర్గం, కోశం, దం డం, మిత్రులు అనే సప్తప్రకృతులుగా కనిపిస్తుంది.
ఒక నాయకుడు ఎలాంటివాడు, అతనివద్ద వనరులు ఎలాంటివి, అతనిని నిలబెట్టే సంస్థాగత శక్తులు ఏమిటో అవగాహన చేసుకొని అతనిని ఆశ్రయించడం ఉత్తమోత్తమం. అలాంటి రాజు లేదా నా యకుడు ద్రవ్యహీనుడైనా, ప్రకృతి హీనుడైనా అతనిని ఆశ్రయించాలి కానీ, ఆత్మ సంపద అనగా గుణసంపద లేనివాడిని ఆ శ్రయించకూడదని ఆచార్య చాణక్య సూచిస్తున్నాడు. ఎందుకు? ఆత్మనిగ్రహం లేని వా టడు ఎంతటి ఐశ్వర్యవంతుడైనా చెడుస్నేహాల వల్ల నైతికతను కోల్పోయి, వివేకర హితుడై నీతినియమాలను వదిలివేయడం వల్ల నశిస్తాడు. ఈ భావనను ఆధునికంగా చెప్పుకుంటే సంపదకన్నా స్వభావం ప్రధానమనే సత్యాన్ని గుర్తించడంగా భావించ వచ్చు.
మంచి ఆశ్రయం కావాలని ఎలాగైతే వ్యక్తి కోరుకుంటాడో అలాగే తన వద్దకు వచ్చే వ్యక్తి ఉత్తమ గుణాలతో ఉండాలని, శిక్షణపొందిన వాడుగా ఉండాలని నాయకుడూ కోరుకుంటాడు. ఉత్తమ నాయకుడి కి ఉత్తమ అనుచరుడు అవసరం. అలాగే సమర్థత కలిగిన అనుచరుడికి విధేయత మాత్రమే లక్షణం కారాదు, వివేచనాపూర్వకమైన విభేదాన్ని వ్యక్తం చేయగల ధైర్యం కూడా అవసరమే. స్వప్రయోజనం కన్నా సంస్థ ప్రయోజనం మిన్నగా భావించే అనుచరుడు సంస్థ ప్రయోజనంకోసం నాయకుడి నిర్ణయాన్ని ప్రశ్నించే ధైర్యం ప్రదర్శించాలి.
ఈ అధ్యాయంలో రాజును ఆశ్రయించిన వ్యక్తులు ఎలా ప్రవర్తించాలో చాలా స్పష్టంగా తెలియచేశాడు చాణక్య. రాజాస్థానంలో ఉన్న సమయంలో ఆశ్రితుడు అ వకాశం వచ్చినప్పుడల్లా నీతిశాస్త్ర సంబంధిత విషయాలను తార్కికంగానూ, శాస్త్రబ ద్ధంగానూ రాజుకు వివరించాలి. తర్కబద్ధంగా, శాస్త్రబద్ధంగా ఉన్న విషయాలు పాలకులతోనూ, సభతోనూ ఆమోదింపబడతాయి, ఆదరింపబడతాయి. దానితో ఆశ్రితుడు అధికారంలో స్థిరత్వాన్ని పొందగలుగుతాడు. పరిషత్తును అనగా సభను చూచి జంకకుండా బుద్ధిబలంచేత, ధర్మార్థాలకు అనుగుణమైన సలహాలు ఇవ్వాలి. రాజు ఎప్పుడైనా కామక్రోధాలకు లోబడి, తొందరపాటు నిర్ణయాలతో ఎవరినైనా దండిస్తున్న సమయంలో అతడిని సంజ్ఞలచేత వారించాలి అంటాడు చాణక్య. అలా గే రాజుకు లేదా పాలకులకు దగ్గరయ్యే వ్యక్తిని పడద్రోసే శక్తులూ ఉంటాయి. వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలి.
జీవితంలో పరిణతి సాధించాలి, ఉన్నస్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలి అ నుకున్న వ్యక్తి తదనుగుణమైన వైఖరిని సంతరించుకోవలసిన అవసరం ఉంటుం ది. చేసే పనిపై భక్తి, ఆ ప్రక్రియపై సమగ్రమైన, సంపూర్ణమైన జ్ఞానము కలిగియుం డడమే కాక త్రికరణశుద్ధిగా కర్మను ఆచరించాలి. అంకితభావంతో కూడిన కర్మాచరణ యే భక్తి. ఉత్తముడైన పాలకుని వద్ద వనరులు తక్కువగా ఉన్నా నేర్చుకునే అవకా శం ఎక్కువగా ఉం టుంది. క్రిందిస్థాయి ఉద్యోగి చేసే పనుల నుంచి కీలక నిర్ణయాలను తీసుకునే అత్యున్నత స్థాయి అధికారి బాధ్యతల వరకు తన ప్రత్యక్ష భాగస్వా మ్యం ఉండడం మూలంగా అన్ని రంగాలలోనూ విస్తృతమైన అనుభవాన్ని పొంద గలిగే అవకాశం ఉంటుంది. దీనిని నాయకత్వాన్ని నేర్చుకునే శిక్షణ ప్రక్రియగా కూ డా భావించవచ్చు.
సాధారణంగా కొత్త పనిని ఆరంభించినప్పుడు.. ముఖ్యంగా అది నిర్ణయాత్మక మైన సమయంలో తత్తరపాటు, భ్రమ వం టివి కలగడం సహజమే. దానికి చలించకుండా ఆ భయం లేదా భ్రాంతికి మూలాలను విచారించాలి. అలాగే భావోద్వేగాల ను అణిచివేయకుండా వాటి కారణాలను అర్థం చేసుకొని నిర్మాణాత్మక వైఖరితో ఆలోచించడం వల్ల స్పష్టమైన పరిజ్ఞానం కలుగుతుంది. దానిని వివేచనతో విశ్లేషించుకొని ఏది కర్తవ్యమో, ఏది అకర్తవ్యమో నిర్ణయించుకోవడం వల్ల స్పష్టమైన, నిర్ణయాత్మకమైన, నిశ్చలమైన మార్గం స్ఫురి స్తుంది.
ఆ మార్గంలో కార్యాచరణ ప్రణాళికను రచించుకొని అంకితభావంతో ముం దుకు సాగితే కార్య సఫలత పలకరిస్తుంది. ఫలితాన్ని సమాజంతో పంచుకుంటే.. విజ యం సాకారమౌతుంది. ఇక్కడ పంచుకోవడం సమాజహితమైన ఆలోచనలు పాల కులతో పంచుకోవడం మాత్రమే. దానితో ప్రజలూ సంతృప్తితో ఉంటారు.. పాలనా సుస్థిరమవుతుంది.. రాజ్యం పటిష్ఠంగా నిలుస్తుంది. ఈ వైఖరి నిరంతర సాధనతోనే అలవడుతుంది. ఈ సాధనలో ‘ఖాళీకుర్చి‘ ప్రతీక ఉత్తమంగా పనిచేస్తుంది.
మనోవిజ్ఞానశాస్త్రంలో ‘ఖాళీకుర్చి‘ ప్రతీ క అపరాధభావాన్ని అధిగమించేందుకు ఒక ఉపకరణంలా పనిచేస్తుంది. ఎదురుగా ఒక ఖాళీకుర్చీని ఉంచి దానిలో మనమెవరితోనైతే ఎదురుగా మాట్లాడలేక లేదా చెప్పాలనే భావనను సరిగా చెప్పలేక పోతామో అలాంటి వారు ఆ కుర్చీలో కూర్చున్నారని ఊహిస్తూ మనసులోని మాటలన్నీ చెప్పుకోవడం వల్ల మనసులో భారం తగ్గుతుంది. నిర్మలమవుతుంది. అలాగే యాజమాన్య నిర్వహణలో మన ఎదుట లేని వ్యక్తి అక్కడ ఉన్నట్లుగా ఊహించి.. వారి భావనలను తామే ప్రతిపాదించి తగిన విధంగా స్పందించడం వల్ల అనవసరమైన సంక్షోభాలను నివారించిన వారమవుతాం.
వ్యాపారంలో ఎదుట ఉన్న కుర్చీలో ఒక వినియోగదారుడు ఉన్నాడని ఊహించడం వల్ల... ‘నేనే ఆ వినియోగదారుడి స్థానంలో ఉంటే ఏమి కోరుకుంటాను‘ అని ప్రశ్నించుకుంటే.. వినియోగదారుని అవసరాలను గుర్తించి తగిన విధంగా స్పందించగలుగుతాం. ఉదాహరణగా ఒక రైతు తనకు అవసరమైన పనిముట్లు ఎలా ఉండాలో చెబితే సాధారణ ఇంజినీరు నమూనా వేసి నిర్మించి ఇస్తాడు. అదే ఉత్తమ ఇంజినీరు అయితే.. ఎదుటి కుర్చీలో కూర్చున్న వ్యక్తి అవసరాలను సమగ్రంగా ఊహించి తగిన విధంగా నమూనాను కల్పించి నిర్మించి ఇవ్వగలుగుతాడు.
‘ఖాళీకుర్చి‘ ప్రతీకను అవలంబించే సమయంలో ఒక్క జాగ్రత్తను తప్పక తీసుకోవలసి ఉంటుంది. ఎదురుగా ఉన్న కుర్చీ సాధారణ కుర్చీ కాదు.. అది ఒక ధర్మపీఠం అనే విషయాన్ని మరచిపోవచ్చు. అక్కడ ధర్మదేవతను కూర్చుండపెట్టకపోతే ఆ స్థానంలో అధర్మదేవత వచ్చి కూర్చుంటుంది. ఎదుటివారి దృష్టికోణం నైతిక ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే.. ఆ దృష్టికోణాన్ని ఆదరించడమంటే అధర్మాన్ని ఆశ్రయించడమే.
మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో.. ద్రౌపది ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా‘ అన్న ప్రశ్న వేసింది. ధర్మజ్ఞులైన పెద్దలు ఎందరో అక్కడ ఉన్నా ఎవరూ సమాధానం చెప్పక ‘ధర్మస్వరం‘ మూగపోయింది. ముందుకు వచ్చిన వికర్ణుడిని ఎవరూ పట్టించుకోలేదు. అక్కడ ఖాళీ కుర్చి ఉన్నా దానిపై అధర్మం కూర్చొనడం వల్ల ధర్మం తన స్థానాన్ని విడిచి పక్కకు తొలగిపోయింది. చివరగా ఆశ్రితుడు తాను ఆశ్రయించదలచిన వ్యక్తి ఎలాంటివాడో స్పష్టంగా తెలుసుకొని అతన్ని ఆశ్రయించడం ఉత్తమ కర్తవ్యం. ఆశ్రయించాక ధర్మబద్ధంగా నిర్భయంగా సలహాలివ్వాలి. ప్రతి నిర్ణయంలో ఎదురుగా ఉన్న ఖాళీ కుర్చీలో ధర్మాన్ని కూర్చోబెట్టాలి.