మట్టి గణపతులనే ప్రతిష్టిద్దాం
11-09-2026 | 05:24pm
తాడ్వాయి,(విజయక్రాంతి): అందరం కలిసికట్టుగా మట్టి గణపతులను(clay ganesha) ప్రతిష్టిద్దామని మండల ప్రత్యేక అధికారి రఘునందన్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా (Kamareddy District)తాడ్వాయి మండల కేంద్రంలో శుక్రవారం ఆయన సర్పంచులు, అధికారులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఇంటిలో మట్టి గణపతులను ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో పర్యావరణాన్ని కాస్తయినా పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భరత్ కుమార్, తహసిల్దార్ శ్వేత, ఎస్సై నరేష్ తదితరులు పాల్గొన్నారు.