మోడీ ఫాసిజానికి, ట్రంప్ యుద్ధోన్మాధానికి వ్యతిరేకంగా పోరాడుదాం
పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ
కూసుమంచి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కూసుమంచి మండల(Kusumanchi Mandal) కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(Progressive Democratic Students Union) (పి.డి.ఎస్.యు), ప్రగతిశీల యువజన సంఘం (పి.వై.ఎల్) ఆధ్వర్యంలో భారత జాతీయోద్యమ వీరుడు షాహిద్ భగత్ సింగ్(Shaheed Bhagat Singh) 119వ జయంతి వారోత్సవాలు (సెప్టెంబర్ 22 నుండి 28 వరకు) పురస్కరించుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College) లో పి డి యస్ యూ ఖమ్మం జిల్లా అధ్యక్షులు తిప్పారపు లక్ష్మణ్ అధ్యక్షతన సెమినార్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ పి వై ఎల్ జిల్లా కార్యదర్శి భరత్ మాట్లాడుతూ భారత జాతీయోద్యమ వీరుడు షాహిద్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థి, యువత పుణికి పుచ్చుకోవాలని, దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద ఫాసిజానికి, ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొనసాగిస్తున్న యుద్దోన్మాద చర్యల కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
80 సంవత్సరాల స్వాతంత్ర్య భారత దేశంలో పేదలందరికీ ఉచితంగా నాణ్యమైన సమాన విద్య, వైద్యం, అందించటంలో, ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించాటంలో పాలకవర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఉన్నత చదువులు అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ బకాయిలు అడిగిన ప్రైవేట్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులు, విజిలెన్స్ అధికారులచే దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు.
మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కుల, మతోన్మాద చర్యలతో దేశ లౌకిక వ్యవస్థ, ప్రజల ఐక్యత ప్రమాదంలో పడిందన్నారు. పాలస్తీనా, క్యూబా ప్రజల న్యాయమైన పోరాటాలకు దేశ ప్రజలంతా సంఘీభావంగా నిలబడాలని, ఇజ్రాయిల్, అమెరికా యుద్దోన్మాద చర్యలను నిరసించాలని, దేశంలో సామ్రాజ్యవాద పెట్టుబడిదారుల ఆర్థిక దోపిడీకి వత్తాసు పలుకుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా షాహిద్ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో సంఘటిత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిడియస్ యు ఖమ్మం జిల్లా యాక్టివ్ కార్యదర్శి రఘు, పి వై ఎల్ పాలేరు డివిజన్ సహాయ కార్యదర్శి కొత్త రమేష్ పి డి యస్ యూ నాయకులు దీపిక,ఇందు,సుప్రియ,సిరి తదితరులుతదితరులు పాల్గొన్నారు.