సాంబారులో బల్లి! వీడియో

27-09-2026 | 01:13pm

19 మంది అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

కాకినాడ జిల్లా తునిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తుని ఉమెన్స్ కాలేజీ(Tuni Women's College)లో మధ్యాహ్న భోజనంగా వడ్డించిన సాంబారులో బల్లి పడినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. అంతటితో ఆగకుండా.. అదే సాంబారును తమకు వడ్డించారని వారు ఆరోపించారు. భోజనం చేసిన కొద్దిసేపటికే పలువురు విద్యార్థినులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో 19 మంది విద్యార్థినులను వెంటనే తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంబారులో బల్లి పడిన విషయాన్ని సిబ్బంది గుర్తించలేదా? గుర్తించినా అదే ఆహారాన్ని విద్యార్థినులకు ఎలా వడ్డించారన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది.


మరిన్ని వార్తలు