జాతీయ రహదారిపై లారీ దగ్ధం

13-09-2026 | 10:18am

గండీడ్, సెప్టెంబర్ 13, (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండల(Gandeed Mandal) పరిధిలోని జానంపల్లి గేట్(Janampalli Gate) సమీపంలో 167వ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం(Fire Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో KA 56 6388 నంబర్ గల లారీ మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు.. సదరు లారీలో పైపుల తయారీలో వినియోగించే లూజ్ ప్లాస్టిక్ స్క్రాప్, ప్లాస్టిక్ బస్తాలు ఉన్నట్లు తెలిసింది.

ఈ లారీ గుజరాత్ నుంచి చెన్నై(Gujarat to Chennai) (మద్రాస్) కి వెళ్తున్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. లారీలోని సరుకుతో పాటు లారీ విలువ కలిపి సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. అయితే నష్టం విలువపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఘటనపై కేేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు