ఎల్పీయూ పదిరోజుల బంద్
- తరగతులు నిలిపివేత.. విద్యార్థులు ఇళ్లకు పయనం
- విధ్వంసకారులపై కఠిన చర్యలు:డీజేపీ
ఫగ్వారా, సెప్టెంబర్ 28: పంజాబ్ రాష్ట్రం(State of Punjab)లో కాపుర్తలా జిల్లాలోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(Lovely Professional University)(ఎల్పీయూ) ని సోమవారం నుంచి పదిరోజుల పాటు మూసివేశారు. క్యాంపస్‌లో తరగతులు నిలిపివేయడంతో చాలా మంది విద్యార్థులు(Students) ఇళ్లకు పయనమయ్యారు. అదే సమయంలో పంజాబ్ డీజీపీ విధ్వంసకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనలను పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్(Punjab State Womens Commission) సుమోటోగా స్వీకరించింది.
సోమవా రం నుంచి 10 రోజుల పాటు తరగతులను నిలిపివేస్తూ ఎల్పీయూ అధికారులు నిర్ణ యం తీసుకోవడంతో, చాలా మంది విద్యార్థులు ఉదయమే క్యాంపస్ వదిలి తమ ఇళ్ల కు వెళ్లిపోయారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మిడ్టర్మ్ పరీక్షలు కూడా వాయిదా ప డ్డాయి. ఎల్పీయూను నిరసనకారులైన వి ద్యార్థులు 15 గంటలకు పైగా దిగ్బంధించిన జాతీయ రహదారి-44పై వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు పోలీసులు తెలి పారు.
జలంధర్-ఫగ్వారా రహదారి పక్కన ఉన్న ఈ విశ్వవిద్యాలయం వద్ద భారీగా పో లీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యాంపస్‌లో హింసాత్మక ఘటనల ఆనవాళ్లు కని పించాయి. పలుచోట్ల ఆస్తులు ధ్వంసమయ్యాయి. అయితే ఈ విధ్వంసానికి బయటి వ్యక్తులే కారణమని చాలా మంది విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్ ముఖ్యమం త్రి భగవంత్ మాన్ ఆదేశాల మేరకు, పరిస్థితిని సమీక్షించడానికి డీజీపీ గౌరవ్ యాదవ్ ఎల్పీయూను సందర్శించారు.
అలాగే లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చిత్కారా యూ నివర్సిటీలో జరిగిన రెండు నిరసన ఘటనలను పంజాబ్ రాష్ట్ర మహిళా కమిషన్ సు మోటోగా స్వీకరించింది. సంబంధిత జిల్లా, పోలీసు యంత్రాంగాల నుంచి ఎఫ్‌ఐఆర్ కా పీలు, క్యాంపస్‌లో విద్యార్థుల భద్రతా చర్యలతో సహా సమగ్ర నివేదికలను ఆ ప్యానెల్ కోరింది. ఈనెల 30న జలంధర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పర్యటన ఉంది.