పదోన్నతి పొందిన అధ్యాపకునికి సన్మానం

01-10-2026 | 09:38pm

మంచిర్యాల స్పోర్ట్స్,(విజయక్రాంతి): మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల(Government Junior College)లో గణిత అధ్యాపకుడిగా, కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ గా సేవలు అందించి, ఇటీవలే ప్రిన్సిపాల్ గా పదోన్నతి పొందిన ఎం. విజిత్ కుమార్ ని గురువారం కళాశాల ఆవరణలో DIEO అంజయ్యతో పాటు అధ్యాపక బృందం శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాలకు అధ్యాపకుడిగా, ఇంచార్జీ ప్రిన్సిపాల్ గా విజిత్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. పదోన్నతిపై జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

మరిన్ని వార్తలు