జర్నలిస్ట్ అనిల్ కుటుంబానికి అండగా ఉంటాం

16-09-2026 | 01:04pm

జర్నలిస్ట్ అనిల్ కుటుంబానికి అండగా ఉంటాం

నా వంతుగా పూర్తి సహకారం అందిస్తా

అవసరమైతే ఎల్ ఓ సి ఇప్పిస్తాం

అనిల్‎తో ఫోన్‎లో మాట్లాడి ధైర్యం చెప్పిన డిప్యూటీ మేయర్ ఎం ఎస్ ఆర్ 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 16: మహబూబ్ నగర్‎కు చెందిన జర్నలిస్టు(Journalist) ఆరగిద్ద అనిల్ కుమార్ భార్య గుండె సంబంధిత వ్యాధితో నిమ్స్‎లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.అనిల్ భార్య అనారోగ్యానికి సంబంధించి విషయాన్ని జర్నలిస్టులు నరేందర్ చారి, సతీష్ రెడ్డి, గోకులం వెంకటేష్, హన్వాడ రవీందర్, బాలరాజు, రాఘవేందర్ డిప్యూటీ మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జర్నలిస్టులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా నిచ్చారు. అనిల్ తో ఫోన్లో మాట్లాడి మనోధైర్యం చెప్పారు. తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని ప్రభుత్వం నుంచి కూడా ఎల్ఓసి అందేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. నిమ్స్ వైద్యులతో మాట్లాడి ఎప్పటికప్పుడు వారితో టచ్ లో ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు డిప్యూటీ మేరకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు