మొక్కజొన్న పంట సాగు చేస్తున్న వ్యక్తి అరెస్ట్
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ రేంజ్ పరిధిలోని నస్రుల్లాబాద్ మండలం బొప్పాస్ పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికి మొక్కజొన్న పంట సాగు(cultivating corn crop) చేస్తున్న దేవసోత్ మోహన్ అనే వ్యక్తిపై గురువారం అటవీ చట్టం(Forest Act) ప్రకారం కేసు నమోదు చేసి అట్టి వ్యక్తిని అరెస్టు చేసి బాన్సువాడ కోర్టులో హాజరు పరచగా బాన్సువాడ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్(Banswada Judicial First Class Magistrate) నిందితుడికి 15 రోజుల రిమాండ్ విధించి నట్లు బాన్సువాడ అటవీ రేంజ్ అధికారి M A హబీబ్ తెలిపినారు. ఎవరైనా అటవీ భూమిని కబ్జా చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట అటవీ సెక్షన్ అధికారి నరేష్,అటవీ బీట్ అధికారులు రమాకాంత్,సయ్యద్, ఇమ్రాన్ తదితరులు ఉన్నారు.