ఉరి వేసుకుని ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి,(విజయక్రాంతి): అప్పుల బాధలు ఎక్కువై ఆర్థిక ఇబ్బందులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన తొడెంగల స్వామి అలియాస్ టింగుల సాయిలు (42) అనే వ్యక్తి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య(commits suicide) చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన సాయిలు భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు అప్పులు పెరిగిపోయాయి.చేసిన అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆయన గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య స్వాతి, ఇద్దరు కుమారులు ఉన్నారు.ఈ విషయమై కుటుంబ సభ్యులు తాడువాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.