ఓ వ్యక్తి అదృశ్యం

07-09-2026 | 09:02pm

మల్కాజిగిరి,(విజయక్రాంతి): ఓ వ్యక్తి  అదృశ్యమైన సంఘటన మల్కాజిగిరి  పోలీసు స్టేషన్(Malkajgiri Police Station) పరిధిలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా(Medak District) మాసాయిపేట్ మండలం బొమ్మరం గ్రామంలో రైతు కుమ్మరి నాగభూషణం (50), శ్యామల భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. నాగభూషణంకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆగస్ట్ 31వ తేది వైద్య చికిత్స నిమిత్తం మల్కాజ్గిరికి వచ్చి ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరికి చెప్పకుండా  నాగభూషణం బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుండి ఆయన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేదు.

దీంతో బాధితురాలు, శ్యామల తన భర్త కనిపించడం లేదంటూ మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదృశ్యమైన వ్యక్తి ఎత్తు:5’.2”,  కోల ముఖం,  చామనచాయ రంగు ఆచూకీ తెలిసిన  వారు ఎవరైనా  ఫోన్ నెంబర్ 7893299671కు గాని లేదా తమకు గాని సమాచారం అందించాలని మల్కాజ్గిరి పోలీసులు కోరారు.

మరిన్ని వార్తలు