స్నేహ నర్సింగ్ కళాశాలలో ఘనంగా న్యూట్రిషన్ వారోత్సవాలు

07-09-2026 | 11:04pm

కోదాడ,(విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్న న్యూట్రిషన్ వారోత్సవాలలో(Nutrition Week celebrations) భాగంగా సోమవారం కోదాడలోని స్నేహ బాలికల నర్సింగ్ కళాశాల(Sneha Nursing College)లో న్యూట్రిషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రథమ సంవత్సర విద్యార్థినులు చపాతి, చికెన్ కర్రీ, ఫ్రూట్ సలాడ్, కిచిడి, బ్రెడ్ ఆమ్లెట్, రాగి మాల్ట్, క్యారెట్ హల్వా, చికెన్ బిర్యానీ, తోటకూర పులుసు తదితర పౌష్టికాహార వంటకాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. తాము తయారు చేసిన ఆహార పదార్థాల్లోని పోషక విలువలు, వాటి ఉపయోగాలను వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ వై.ఎస్.పుల్లమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ ఖాసిం, విశిష్ట అతిథిగా ఎంఎస్ విద్యా సంస్థల సీఈవో వై.ఎస్.రావు, పరిశీలకురాలిగా తేజ ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు సాహితీ హాజరై విద్యార్థినులు తయారు చేసిన వంటకాలను రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆరోగ్యకరమైన, బలవర్ధకమైన వంటకాలు చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎస్.కె.రేష్మ, కె.నవ్య, వరలక్ష్మి, నసీమా మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు