మైసమ్మ గుడి హుండీ చోరికి యత్నంచిన ఇద్దరు అరెస్టు
బెల్లంపల్లి,(విజయ క్రాంతి): బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్(Bellampalli Singareni Area Hospital), ఆవరణలో ఉన్న మైసమ్మ గుడి(Maisamma temple) హుండీ చోరికి యత్నంచిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను వన్ టౌన్ ఎస్హెచ్వో శ్రీనివాసరావు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తులు గుడి తాళాలను పగలగొట్టి, గుడిలో ఉన్న హుండీని దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించగా, హాస్పిటల్ వద్ద సెక్యూరిటీ గగార్డు చింతం మొగిలి, హాస్పిటల్ స్టాఫ్ పట్టుకున్నారు. హుండీలో సుమారు రూ.2000/- వరకు నగదు ఉంది. చోరికి యత్నంచిన కరీంనగర్ జిల్లా అంతర్గాం మండలం మర్రిపల్లి కి చెందిన మడక చిరంజీవి, బెల్లంపల్లి మండలం అకేనపల్లి గ్రామానికి చెందిన కుంటాల భీమయ్య లను అరెస్టు చేసినట్టు తెలిపారు. ఇద్దరూ ప పాత నిరసన తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని నిందితులను కోర్టు లో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు.
