పోక్సో కేసులో నిందితుడికి కఠిన కారాగార శిక్ష

01-10-2026 | 10:20pm

మేడ్చల్ ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టు తీర్పు

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఫోక్సో కేసు(POCSO Case)లో నిందితుడికి కఠిన కారాగార శిక్ష పడ్డ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station) పరిధిలో జోరిల్ల వెంకటయ్య (55) స్థానిక జ్యోతి (బాలాజీ నగర్) కాలనీలో నివసిస్తున్నారు. అతనిపై జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఐపిసి సెక్షన్ 354 ఫోక్సో చట్టం 2012 సెక్షన్ 12 మేడ్చల్ జిల్లాలోని అత్యాచారం విచారణ పరిష్కార కోసం నిందితుడికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల రూపాయల జరిమానా విధించారు.

బాధితురాలికి 50 వేల రూపాయల పరిహారం చెల్లించాలని తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సైదులు మాట్లాడుతూ త్వరగా తీర్పు రావడం శుభ పరిణామం అన్నారు. చట్టం తమ పని తాము చేసుకబోతుందన్నారు. ప్రజలు చట్టాలను గౌరవించాలని, శాంతి భద్రతలు అసాంఘిక  కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

మరిన్ని వార్తలు