మారుతి సుజుకి స్టన్నింగ్ బలేనో

10-09-2026 | 05:05am

హైదరాబాద్‌లోని వరుణ్ మోటార్స్‌లో ఆవిష్కరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారాహిల్స్, బేగంపేటలోని వరుణ్ మోటార్స్ షోరూంలలో మారుతి సుజుకి(Maruti Suzuki) నూతన ‘స్టన్నింగ్ బలేనో(Baleno)’ కారును చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు. యువతను ఆకట్టుకునే లా ‘డేర్ టు గో గ్లామ్’ థీమ్‌తో కారును రూ పొందించారు. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో తొలిసారిగా లెవెల్-2 ఏడీఏఏఎస్ టెక్నాలజీని ఇందులో అందించారు. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

6 ఎయిర్ బ్యాగ్లు, ఈఎస్పీ, ఏబీఎస్, ఈబీడీ, టీపీఎంఎస్, 360 డిగ్రీ కెమెరా, హె చ్‌యూడీ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నా యి. నూతన జీ12ఈ ఇంజిన్‌తో మెరుగైన మైలేజ్ అందిస్తోంది. మాన్యువల్ వెర్షన్ 23.80 కి.మీ/లీటర్, ఏజీఎస్ ఆటోమేటిక్ 24.77 కి.మీ/లీటర్, ఎస్‌సీఎన్జీ వెర్షన్ 33.61 కి.మీ/కేజీ మైలేజ్ ఇస్తుందని సంస్థ తెలిపింది. నూతన బలేనో ప్రారంభ ఎక్స్ షో రూం ధర రూ.6.09 లక్షలుగా నిర్ణయించారు. పెట్రోల్ ఎంటీ, ఏజీఎస్‌తో పాటు ఎ స్సీఎన్జీ వేరియంట్లలో కారు అందుబాటులో ఉంది. కార్యక్రమంలో మారుతి గ్రూప్ సీసీఓ దేబ్‌జ్యోతి దత్తా, రీజినల్ మేనేజర్ గణేష్ దత్ ఆనంద్, ఎస్బీఐ డీజీఎం టిఎం మనోజ్, వరుణ్ మోటార్స్ ఎండీ వరుణ్ దేవ్, ఈడీ ఆర్‌సి రాజు, బిజినెస్ హెడ్ ఆర్‌వి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు