మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు.. 10 వేల మందితో సభ

25-09-2026 | 05:02pm

జనగామ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy's)రాక సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సభ ముఖ్య ఉద్దేశం అభివృద్ధి పనులను ప్రారంభించడమేనని తెలిపారు. మున్సిపల్ ఆటోలు 16, ఒక జేసీబీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ, తరిగొప్పుల, జనగామ, ఎమ్మార్వో కార్యాలయాలు  కార్యక్రమాలు ప్రారంభిస్తారని, జనగామ జిల్లా వ్యాప్తంగా సుమారు 10 వేల మంది ఈ సభకు హాజరవుతారని తెలిపారు.

మరిన్ని వార్తలు