గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

07-09-2026 | 07:09pm

శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్

పాపన్నపేట: మండలంలో గణేష్ ఉత్సవ వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్(Medak DSP Prasanna Kumar) సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వినాయక మండప నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. వేడుకల్లో అన్నీ వర్గాలు, మతాల ప్రజలు పరస్పర సహకారం, సోదర భావంతో వ్యవహరించుకోవాలని సూచించారు. నవరాత్రి వేడుకలకు(Navratri celebrations) పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో 112 నెంబర్ కు ఫోన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో సీఐ కృష్ణమూర్తి, స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది, ఆయా గ్రామాల్లోని మండపాల నిర్వాహకులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు