calender_icon.png 28 January, 2026 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికలపర్వం...

28-01-2026 06:40:06 PM

- బిఆర్ఎస్ పార్టీ లో చేరిన నిమ్మశెట్టి రాజు

- మన బాధలు.. మన కష్టాలు తీరాలంటే..మళ్ళీ బిఆర్ఎస్ అధికారంలోకి రావాలి

- కాంగ్రెస్ వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదు

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణానికి చెందిన 14వార్డు నుండి నిమ్మశేట్టి రాజు మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కండువాను వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు  చేతులమీదుగా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసింది ఏం లేదని. పద ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని.. అభివృద్ధి కేవలం టిఆర్ఎస్ తోనే సాధ్యమని నమ్మి పార్టీలోకి చేరామన్నారు.. దాదాపు 200 మంది యువకులతో నిమ్మచెట్టి రాజు పార్టీలో చేరగా వారికి చెల్మెడ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.