పశు వైద్యాధికారికి మెమో జారీ

22-09-2026 | 06:20pm

కోటపల్లి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల పశు వైద్యాధికారి(Veterinary Officer) సమయానికి విధులకు హాజరు కాకాపోవడంతో ఈ నెల 19న 'విజయక్రాంతి'లో "సమయానికి రారు... అందుబాటులో ఉండరు... తెరుచుకోని కార్యాలయం.. ఫోటో తీస్తే బెదిరింపులు..." పేరిట వచ్చిన కథనానికి పశుసంవర్ధక, పశు వైద్య అధికారి డాక్టర్ యాకుబ్ రెడ్డి స్పందించి ఈ నెల 21న విచారణ జరిపి కోటపల్లి వెటర్నరీ డాక్టర్ అరుణకు మెమో జారీ చేశారు. సదరు అధికారి ఏ సమయానికి వస్తున్నారు, ఎటు వెళ్తున్నారు తెలిపే టూర్ డైరీ, పశువులకు అందిస్తున్న వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలు తెలియజేయాలని పశు పోషకులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు