సెమీస్‌లో పురుషుల కబడ్డీ జట్టు

24-09-2026 | 05:05am

మహిళల జట్టుకు మరో విజయం

నగోయా, సెప్టెంబర్ 23: ఆసియా క్రీడ(Asian Games)ల్లో భారత కబడ్డీ జట్లు(Indian Kabaddi Teams) అదరగొడుతున్నాయి. పురుషుల జట్టు(Men's team) సెమీఫైనల్(Semifinal) బెర్త్ ఖాయం చేసుకోగా, మహిళల జట్టు(Womens team) కూడా వరుస విజయాలతో దూసుకెళుతోంది. జపాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 49--24 తే డాతో విజయం సాధించింది. అదే జోరుతో భారత్ 48-25 తేడాతో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. వరుస విజయాలతో గ్రూప్-ఏలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. జపాన్, బంగ్లాదేశ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా(Republic of Korea) జట్లపై భారత్ ఘన విజయాలు సాధించింది.

సెమీఫైనల్‌కు అర్హత సాధించడంతో పాటు భారత్  పతకాన్ని కూడా ఖాయం చే సుకుం ది. గ్రూప్ దశలో చివరి మ్యా చ్‌గా భారత్ చైనీస్ తైపీతో తలపడనుంది. మహిళల కబడ్డీలోనూ భారత్ వరుసగా రెండు విజయాలు సాధించింది. గ్రూప్--ఏ తొలి మ్యాచ్‌లో 42--21 తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. బుధవారం ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 37--23 తేడాతో విజయం సాధించింది. దీంతో మహిళల టీమ్ కూడా గ్రూప్--ఏలో అగ్రస్థానం లో కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో భాగంగా భారత్ తన తదుపరి గ్రూప్ మ్యా చ్‌ను జపాన్‌తో ఆడనుంది.

మరిన్ని వార్తలు