ధ్యానంతో మానసిక ఆరోగ్యం
విద్యార్థులు ఏకాగ్రత పెంచుకునేందుకు లక్ష సాధనం ధ్యానం
గరిడేపల్లి,(విజయ క్రాంతి): మండలంలోని పిఎంశ్రీ గడ్డిపల్లి మోడల్ స్కూల్(PM Sri Gaddipalli Model School)లో, పిరమిడ్ సొసైటీ సూర్యాపేట (Suryapet)ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ధ్యానం(meditation) ద్వారా శారీరక రుగ్మతలు దూరమై మానసిక ఆరోగ్యం, ప్రశాంతత మెరుగుపడుతుందని, విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం చేయాలని సూచించారు.
చదువులో ఏకాగ్రత పెంచుకుని లక్ష్య సాధనకు ధ్యానం దోహదపడుతుందని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జె. ప్రసన్నకుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడిని అధిగమించి ఆరోగ్యంగా ఉండేందుకు శ్వాసపై ధ్యానాన్ని దినచర్యగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగరాజు, సతీష్‌కుమార్, శైలజ, డాక్టర్ కందుల శివకృష్ణ, డాక్టర్ శ్రవణ్‌కుమార్, దామ్లా, వీరభద్రం, మల్లికార్జున్‌రెడ్డి, అనిల్, శ్రీను, నవాబ్, ప్రమీల శేఖర్, రాజేశ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.