ఇంటర్నేషనల్ టీచర్స్ డే సందర్భంగా ఎంఈఓకు ఘన సన్మానం
05-10-2026 | 11:54pm
తూప్రాన్, అక్టోబర్ 5, (విజయక్రాంతి): ఇంటర్నేషనల్ టీచర్స్ డే ను పురస్కరించుకొని తూప్రాన్ మండల ఎంఈఓ పర్వతి సత్యనారాయణ(MEO Parvathi Satyanarayana)ను తూప్రాన్ మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఇస్లాంపూర్ గ్రామ సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల సర్పంచులు కలసి ఘనంగా శాలువాతో సన్మానించారు. ఇందులో మున్సిపల్ చైర్మన్, రజిని, యావపూర్ సర్పంచ్ యాంజాల స్వామి, నర్సంపల్లి సర్పంచ్ ధరావత్ భాస్కర్, గుండ్రెడ్డిపల్లి సర్పంచ్ యాదమ్మ, వట్టూరు సర్పంచ్ శ్రీనివాస్, ఇమామ్ పూర్ సర్పంచ్ స్వరూప, దాతర్పల్లి సర్పంచ్, వెంకటరత్నాపూర్ సర్పంచ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.