21 August, 2026 | 2:51 AM

సత్తుపల్లిలో మంత్రి పొంగులేటి, డాక్టర్ మట్టా దయానంద్ పర్యటన

21-08-2026 01:11 AM

తోట సుజలారాణి, తోట గణేష్ నివాసంలో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం

ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు సందీప్ గౌడ్ తల్లి చిత్రపటానికి నివాళులు

సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహారావు ఆరోగ్య వివరాలు తెలుసుకున్న మంత్రి

సత్తుపల్లి, ఆగస్టు 20: (విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పర్యటించారు. సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్ తోట సుజలారాణి, తోట గణేష్ నివాసంలో కాంగ్రెస్ నాయ కులు, కార్యకర్తలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కలుసుకున్నారు.

అనంతరం సత్తుపల్లి పట్టణంలోని సీఎస్‌ఐ చర్చ్ రోడ్డులో సత్తుపల్లి నియోజకవర్గ ఎన్‌ఎస్యూఐ అధ్యక్షులు అర్వపల్లి సందీప్ గౌడ్ తల్లి ఇటీవల మరణించగా, ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఘనంగా నివాళులు అర్పించారు.

తదుపరి కాకర్లపల్లి రోడ్డులోని సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించి ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు. సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహన బేగం కమల్ పాషా, వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబ్బారెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, కౌన్సిలర్ తోట సుజలారాణి, తోట గణేష్, సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్‌ఎస్యూఐ అధ్యక్షులు సందీప్ గౌడ్, ప్రజలు పాల్గొన్నారు.