2 September, 2026 | 5:14 PM

ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు ప్రశంసించలేదు

02-09-2026 | 04:08pm

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో(Telangana State) ప్రజాపాలనకు వెయ్యి రోజులు అయ్యిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. సామాన్య ప్రజల కష్టాలు తీర్చేందుకు కృషి చేశామని, ముఖ్యమైన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పరిపాలన చేశామని, గత ప్రభుత్వం పెట్టిన అప్పులను చెల్లిస్తున్నామని, రైతును రాజును చేసేలా పరిపాలన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రైతులకు(Farmers) రూ.1.74 లక్షల కోట్లు ఇచ్చామని, వరి వేస్తే ఉరేనని ఆనాటి దొర అన్నారు.

 కానీ మా ప్రభుత్వం రాగానే వరికి బోనస్ ఇస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వరి సాగులో తెలంగాణ దేశంలోనే ప్రథమస్థానం సాధించిందని, రైతులకు భరోసా కల్పించేలా పాలన కొనసాగిస్తున్నాం. గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించిందని, గ్రూప్-1 ప్రశ్న ప్రత్రాలను(Group-1 Question Papers) అమ్ముకున్నారు. మా ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని(TGPSC) ప్రక్షాళన చేశామని, కోర్టు ద్వారా గ్రూప్-1 నియామకాలు ఆపాలని చూశారు.

ఇటీవలే 10 వేల జాబ్ లకు నోటిఫికేషన్లు ఇచ్చామని, ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని మంత్రి చెప్పారు. పేదలకు సంక్షేమ పథకాలు(Welfare schemes) అందించాలనే తపనతో పని చేస్తున్నామని, వారి ఉద్యోగాలను ఊడగొట్టారని ప్రజలకు రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వం చేసిన ఏ కార్యక్రమాన్ని ప్రతిపక్షాలు ప్రశంసించలేదని, ఉపఎన్నికల్లో ఎన్ని పొర్లు దండాలు పెట్టిన కాంగ్రెస్ గెలిచింది. ఉపఎన్నికల్లో ఓడినా బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి జ్ఞానోదయం కాలేదని,  ప్రజలు అసహ్యించుకుంటున్నా బీఆర్ఎస్ మారలేదని మంత్రి పొంగులేటి ఎద్దేవా చేశారు.