రమేష్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

10-09-2026 | 04:31pm

పాడె మోసిన ఎమ్మెల్యే సోదరులు

రాజాపూర్: చేన్నవెళ్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రమేష్ రెడ్డి ఆకాల మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. ఆయన మృతిపట్ల అనిరుధ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రమేష్ రెడ్డి స్వగ్రామంలో పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నంతరం ఎమ్మెల్యే, దుష్యంత్ రెడ్డి ఆయన పాడె మోసి అంతిమయాత్ర(funeral procession)లో పాల్గొని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, వివిధ పార్టీల మండల ప్రజా ప్రతినిధులు నాయకులు రమేష్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు