ఎయిడ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి,(విజయక్రాంతి): ఎయిడ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు(MLA Gandra Satyanarayana Rao) పిలుపునిచ్చారు. గురువారం ఐడీఓసీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ(District Medical and Health Department) ఆధ్వర్యంలో నిర్వహించిన ఎయిడ్స్ అవగాహన బైక్ ర్యాలీని కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma)తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిడ్స్‌పై ఉన్న అపోహలను తొలగించి, నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల వరకు పరీక్షలు, వైద్య సేవలు అందుబాటులో ఉంచిందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని కోరారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్ఓ డా. మధుసూదన్, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.