4 September, 2026 | 2:20 AM

మోడీ సంస్కరణలతోనే ఎన్డీయే వికాస యాత్ర: నడ్డా

07-06-2024 | 12:27pm

న్యూఢిల్లీ: దేశంలో మూడోసారి ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఎన్డీయే ఎంపీల సమావేశంలో జేపీ నడ్డా మాట్లాడారు. చరిత్రాత్మక ఘటనకు మనందరం సాక్షులుగా నిలుస్తున్నామని తెలిపారు. మోడీ అనునిత్యం దేశ సేవకు అంకితమయ్యారని నడ్డా స్పష్టం చేశారు. ఒడిశాలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. ఏపీలో కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ లో మూడో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందన్నారు. సిక్కింలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోందన్న ఆయన మోడీ సంస్కరణలతో ఎన్డీయే వికాస యాత్ర కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. పదేళ్ల క్రితం దేశం పురోభివృద్ధిలో వెనకబడి ఉంది.. మోడీ నేతృత్వంలో వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు వెళ్తున్నామని నడ్డా స్పష్టం చేశారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ సంకల్పంతో సాగుతున్నామన్నారు. ఎన్డీఏ ఎంపీల సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమికి చెందిన ఎంపీలు హాజరైయ్యారు.