4 September, 2026 | 3:20 AM

ఎన్డీఏ ఎంపీల సమావేశం ప్రారంభం.. హాజరైన చంద్రబాబు, పవన్

07-06-2024 | 12:12pm

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీని తమ నాయకుడిగా ఎన్నుకోవడానికి, బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) కొత్తగా ఎన్నికైన ఎంపీలు శుక్రవారం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారు. ఆయన మూడవసారి ప్రధానమంత్రిగా ఉండటానికి మార్గం సుగమం చేసారు. ఎన్డీయే ఎంపీలతో పాటు, ముఖ్యమంత్రులతో సహా సీనియర్ కూటమి నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్డీయే ఎంపీల సమావేశం కొనసాగుతోంది.

ఈ సమావేశంలో బీజేపీ ఎంపీలు, మిత్రపక్షాల ఎంపీలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, నీతీశ్ కుమార్, పవన్ కల్యాణ్ నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన శక్తి, ఎన్ సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదళ్ ఎంపీలు, ఎన్డీయే పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు. మోడీ నాయకత్వానికి ఎన్డీయే ఎంపీలు లాంఛనంగా ఆమోదముద్రవేశారు. ఎంపీలు మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు.