డివైడర్‌ను ఢీకొట్టిన మోటార్‌సైకిల్

07-09-2026 | 11:31pm

- ఒకరికి తీవ్ర గాయాలు.. తప్పిన పెను ప్రమాదం

కొండపాక: కొండపాక మండలం(Kondapaka Mandal) దుద్దెడ మూలమలుపు వద్ద రాజీవ్ రహదారిపై సోమవారం మోటార్‌సైకిల్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం ఎం. మహేష్ హైదరాబాద్ నుంచి ముస్తాబాద్ మండలం నామాపూర్‌కు వెళ్తుండగా మలుపు వద్ద బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి వైపున పడిపోయాడు. అదే సమయంలో అటువైపు నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తమై బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంలో మహేష్ ధరించిన హెల్మెట్ కూడా ఎగిరి పక్కకు పడిపోయింది. సమాచారం అందుకున్న టోల్‌ప్లాజా సిబ్బంది రాకేష్, జీఎస్ గౌడ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు