ఉద్యమంతో సాధించాం... కార్యరూపం ఎప్పుడో?

07-09-2026 | 10:06pm

రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన(Ramayampet Revenue Division Sadhana) కోసం కాంగ్రెస్, బీజేపీతో పాటు పట్టణంలోని సబ్బండ వర్గాలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాల నాయకుల మద్దతుతో తాము చేపట్టిన ఉద్యమాన్ని అశ్విని శ్రీనివాస్ గుర్తు చేశారు. ఐదు నెలల పాటు నిరాహార దీక్షలు చేస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని తెలిపారు. మండుటెండలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా, నెలరోజుల పాటు కురిసిన భారీ వర్షాల్లోనూ ఉద్యమాన్ని కొనసాగించామని పేర్కొన్నారు. 

తమ ఉద్యమ ఫలితంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR)తో మెదక్ నడిబొడ్డునే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేయించుకున్నామని తెలిపారు. ప్రకటనతో పాటు తాత్కాలిక ఆర్డీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, తూప్రాన్(Toopram) ఆర్డీవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి కార్యాలయాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే పూర్తిస్థాయి అధికారులు, సిబ్బంది నియామకం జరగకపోవడం, పూర్తిస్థాయి గెజిట్ విడుదల కాకపోవడంతో రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఆశయం నెరవేరకుండానే మరుగున పడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న రెవెన్యూ డివిజన్ కార్యాలయం కేవలం పేరుకే ఉండటం బాధాకరమన్నారు.

మరిన్ని వార్తలు