​చేయూత పెన్షన్ల ఆన్‌లైన్ ప్రక్రియపై అపోహలు నమ్మవద్దు

01-10-2026 | 10:02pm

ఎంపీడీవో ప్రవీణ్ కుమార్

వెంకటాపురం,(విజయక్రాంతి): ​మండలంలో చేయూత పెన్షన్ల మంజూరు ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారుల వివరాలను ఆన్‌లైన్ చేసి, అధికారుల లాగిన్ ద్వారా జిల్లా కేంద్రానికి, రాష్ట్ర స్థాయి ఎస్ఈఆర్పి కార్యాలయానికి మంజూరు కోసం పంపడం జరుగుతోందని వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ కుమార్(Mandal Parishad Development Officer Praveen Kumar) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ల(Pension) మంజూరు పేరుతో కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్లు చేసి డబ్బులు అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఎవరూ కూడా ఇటువంటి ఫోన్ కాల్స్ నమ్మి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దని స్పష్టం చేశారు. మండల, జిల్లా కేంద్రాల అధికారుల తరఫున ఎవరూ డబ్బులు అడగరని, ఒకవేళ ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరిన్ని వార్తలు