ఖబర్దార్ హమారా ప్రసాద్
* ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిగారి రాజేందర్ మాదిగ
చేర్యాల,సెప్టెంబర్ 16(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(Dr. Babasaheb Ambedkar)ను కల్పిత నాయకుడంటూ అనుచిత వ్యాఖ్యలతో పుస్తకం రాసిన హమారా ప్రసాద్‌ను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమిగారి రాజేందర్ మాదిగ డిమాండ్ చేశారు.
చేర్యాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించడం అంటే 140 కోట్ల మంది ప్రజల మనోభావాలను కించపరచడమేనన్నారు. హమారా ప్రసాద్ రాసిన పుస్తకాన్ని నిలిపివేసి, ముద్రించిన ప్రతులను స్వాధీనం చేసుకోవాలని కోరారు.అరెస్టు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో భూమిగారి రత్నం, కర్ణాకర్, పాకాల అనిల్, శ్రీరామ్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.