నమస్తే న్యూస్ రిపోర్టర్‌కు తీవ్ర గాయాలు

02-10-2026 | 03:21pm

మేడిదిపల్లి శివారులో ఘటన.. బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం,

తిరుమలాయపాలెం అక్టోబర్ 2 (విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండలానికి చెందిన నమస్తే న్యూస్ రిపోర్టర్(Namaste News Reporter) బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఘటన మేడిదిపల్లి శివారులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇనుగుర్తి మండలంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో మేడిదిపల్లి శివారులో మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో రిపోర్టర్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు