లక్కారంలో మెగా రక్తదాన శిబిరం

02-10-2026 | 05:17pm

ముత్తారం, అక్టోబర్0 2 (విజయక్రాంతి): తలసేమియా చిన్నారులకు రక్తం అందించేందుకు లక్కారం గ్రామంలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రజిత ఫౌండేషన్(Rajitha Foundation) ఆధ్వర్యంలో ప్రతిమ ఆసుపత్రి, కరీంనగర్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ, గ్రామ సర్పంచ్ అత్తే చంద్రమౌళి, రజిత ఫౌండేషన్ నిర్వాహకుడు మొగిలి శ్రీనివాస్, ఉపసర్పంచ్ చల్లూరి రాజ్‌కుమార్, వార్డు సభ్యులు మదాసి శ్రీకాంత్, భాషవేన ఈధాలు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు చ. రాజ్‌కుమార్, బర్ల కొమురయ్య, వేణు, నరేష్, శంకర్, పుల్లూరి బాపు, ప్రవీణ్‌తో పాటు పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారుల కోసం రక్తదానం చేయడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు