రాజీ మార్గమే రాజమార్గం
జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కోరుట్ల,(విజయక్రాంతి) జిల్లా న్యాయ సేవాధికార సంస్థ(District Legal Services Authority), ఢిల్లీ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, జగిత్యాల జిల్లా(Jagtial district)లోని అన్ని కోర్టులలో తేదీ 12.09.2026 నాడు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీ పడదగిన క్రిమినల్ కేసులు(Criminal cases), సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబందించిన కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టంకు సంబందించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడును. కావున కక్షి దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, తేదీ 12.09.2026 నాడు జాతీయ లోక్ అదాలత్ లో మీ కేసులను పరిష్కరించుకోగలరని డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ మట్ట సరిత ఒక ప్రకటనలోతెలిపారు.