ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్ కుమార్ ప్రసాద్
07-06-2024 | 10:20am
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది. 1987 బ్యాచుకు చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శగిగా ఉన్నారు. ఆంధ్రలో ప్రభుత్వం మారడంతో సీఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి గురువారం సెలవుపై పంపిన విషయం తెలిసిందే. ఆయన జూన్ చివరలో పదవీ విరమణ చేయనున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడంతో జూన్ 12న ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా నాారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి.






