యువ టూరిజం క్లబ్ మూడో స్థానంలో నేరేడుచర్ల
నేరేడుచర్ల, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): ప్రపంచ పర్యాటక దినోత్సవం(World Tourism Day) పురస్కరించుకొని శనివారం నాడు సూర్యాపేట జిల్లా టూరిజం శాఖ(Suryapet District Tourism Department) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ టూరిజం క్లబ్(Youth Tourism Club) లో భాగంగా నిర్వహించిన చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలకు సంబంధించి నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల(Nereducherla Government Junior College) విద్యార్థులు జాన్ పహాడ్ దర్గా విశిష్టతను వివరిస్తూ చేసిన వీడియో డాక్యుమెంటరీ మరియు పొనుగోడు చారిత్రాత్మక దేవాలయం సంబంధించి గీసిన చిత్రానికి జిల్లాస్థాయిలో యువ టూరిజం క్లబ్ మూడో స్థానంలో నిలిచారు.
ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ తేజస్లాల్ నంద పవర్, డిఐఈఓ సులోచన రాణి చేతుల మీదుగా నేరేడుచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు మూడో ప్రైజ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్ర్స్ డాక్టర్ మద్దిమడుగు సైదులు అంజయ్య లతోపాటు విద్యార్థులు మణిదీపు, సైదులు,లోకేష్, సుభాని, సతీష్, శ్రీకాంత్, సమీరా లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ పి. నీరజ తోపాటు అధ్యాపకులు పి. వెంకటరమణ,ప్రణతి,కే ఎన్ రావు తదితరులు అభినందించారు.