కళ్లకు నల్ల రిబ్బన్లతో నిరసన

01-10-2026 | 10:04pm

బిజినేపల్లి: కరోనా మహమ్మారి(COVID pandemic) వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తమ ప్రాణాలను, కుటుంబ సభ్యుల భద్రతను పక్కన పెట్టి ప్రజల ఆరోగ్య పరి రక్షణ కోసం పని చేసిన NHM, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల(NHM, outsourcing employees) న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలోని పీ.హెచ్.సీలో వారు తమ కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని  నిరసన తెలిపారు. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 12వ తేదీ వరకు ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆరోగ్య వ్యవస్థలో తాము కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో అనేక సందర్భాల్లో వివిధ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించి సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు.

మరిన్ని వార్తలు