హైదరాబాద్‌లో గోల్డ్ రేట్‎లో నో ఛేంజ్!

20-09-2026 | 11:10am

హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కాస్త ఊరట లభించింది. వరుసగా రెండు రోజుల పాటు భారీగా పెరిగిన పసిడి ధరలు(Gold prices) ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌(Hyderabad Bullion Market)లో బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం లభించినట్లైంది. 

ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయం నేపథ్యంలో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గాయి. అయితే ఆ తర్వాతి రోజు నుంచే పసిడి ధరలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. వరుసగా రెండు రోజుల పెరుగుదలతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు.

24 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ.1,55,840, 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములకు రూ.1,42,850, వెండి: కిలోకు రూ.2,60,000.. మరోవైపు వెండి ధరలు మాత్రం ఇటీవల భారీగా పెరిగాయి. కేవలం రెండు రోజుల్లోనే కిలో వెండి ధర సుమారు రూ.10 వేల మేర పెరగడం గమనార్హం. బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, డాలర్ విలువ, దేశీయ డిమాండ్ వంటి పలు అంశాలపై ఆధారపడి రోజురోజుకూ మారుతూ ఉంటాయి. నగల కొనుగోలు సమయంలో ఆ రోజు స్థానిక మార్కెట్ ధరతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ తదితరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

మరిన్ని వార్తలు