విండీస్‌తో వన్డే సమరం

27-09-2026 | 05:25am
  1. తొలి మ్యాచ్‌కు గిల్ సేన రెడీ
  2. రోకో జోడీపైనే అందరి చూపు 
  3. తుది జట్టు కూర్పుపై ఆసక్తి 

తిరువనంతపురం, సెప్టెంబర్ 26 : టీమిండియా స్వదేశీ సీజన్‌కు(Team India's home season) సిద్ధమైంది. వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్ స్టేడియం ఈ పోరుకు వేదిక కానుంది. గాయాలు, ఆసి యా క్రీడల కారణంగా పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. దీంతో అం దుబాటులో ఉన్న ఆటగాళ్లతో జట్టు కూర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది.

రో హిత్ శర్మ, శుబ్మన్ గిల్ ఓపెనర్లుగా రానుండగా, విరాట్ కోహ్లీ 3వ స్థానంలో వస్తాడు. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో, రు తురాజ్ గైక్వాడ్ 5వ స్థానంలో, కేఎల్ రాహు ల్ 6వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణా గాయాలతో జట్టుకు దూరమయ్యారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఆసియా క్రీడల కోసం వెళ్లారు. దీంతో నితీశ్ కుమార్ రెడ్డికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

రవీంద్ర జడేజా, కుల్దీప్ యా దవ్ స్పిన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది లా ఉంటే ఈ మ్యాచ్‌లో అందరి చూపు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఉంది. వచ్చే ఏడాది జరగబోయే వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇద్దరికీ అత్యంత కీలకం.

మరోవైపు న్యూజిలాండ్, శ్రీలంకతో సిరీస్‌లు కోల్పోయిన వెస్టిండీస్ ఈ సిరీస్‌లో సత్తా చాటాలని చూస్తోంది. వచ్చే ఏడాది ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు ముందు ఈ సిరీస్ ఆ జట్టుకు కీలకం. 19 ఏళ్ల స్పిన్నర్ విటెల్ లాస్పునా ఆస క్తి నెలకొంది. ఐదు వన్డేల్లో అతడు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఇకతిరువనంతపురం పిచ్ సాంప్రదాయకంగా ఫాస్ట్ బౌలర్లకు, స్పి న్నర్లకు కూడా అనుకూలిస్తుంది. 2018లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను భార త్ కేవలం 104 పరుగులకే ఆలౌట్ చేసింది.

తుది జట్ల అంచనా 

భారత్ : రోహిత్ శర్మ, గిల్ (కెప్టెన్), విరా ట్ కోహ్లీ, జైస్వాల్, రుతురాజ్, కేఎల్ రాహు ల్ (కీపర్), జడేజా, నితీశ్ రెడ్డి, కుల్దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్/గుర్నూర్ బ్రార్

వెస్టిండీస్ : జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీ వ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్), రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, మాథ్యూఫోర్డ్, గుడాకేశ్ మోతీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, జోసెఫ్

మరిన్ని వార్తలు