హాలీవుడ్‌కు ‘మహారాజ’.. విజయ్ సేతుపతి పాత్రలో ఆస్కార్ హీరో..?
16-09-2026 | 03:48pm
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘మహారాజ’ ఇప్పుడు హాలీవుడ్‌లో రీమేక్ కానుంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో 2024లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ‘ప్యాషన్ స్టూడియోస్’ ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. హాలీవుడ్‌లో రీమేక్ కానున్న తొలి తమిళ చిత్రంగా ‘మహారాజ’ నిలవనుందని సంస్థ పేర్కొంది.
ఇక ఈ రీమేక్‌లో విజయ్ సేతుపతి పోషించిన పాత్రలో ఆస్కార్ అవార్డు అందుకున్న ఓ స్టార్ హీరో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే హీరో ఎవరనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.