మన అంగన్వాడి మన బాధ్యత

26-09-2026 | 11:22pm

హుజూర్ నగర్ సీడీపీఓ పార్వతి

హుజూర్ నగర్, సెప్టెంబర్ 26: మన అంగన్వాడి(Anganwadi) మన బాధ్యత అని హుజూర్ నగర్(Huzur Nagar) సీడీపీఓ అడావత్ పార్వతి,ఐసీడీసీ సూపర్వైజర్ నట్టే రమాదేవి అన్నారు.శనివారం హుజూర్ నగర్ మండల పరిధిలోని లింగగిరి సెక్టర్ పరిధిలో లింగగిరి రైతువేదిక(Lingagiri Rythu Vedika) నందు 9వ జాతీయ భూషణ మహోత్సవాన్ని(National Nutrition Month Celebrations) ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో(Anganwadi centers) సమాజ పోషణ ఆరోగ్యం, బాల్య దశలో విద్యా వికాసానికి ప్రధాన కేంద్రాలుగా ఉపయోగపడ తాయన్నారు.

గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, చిన్నారులకు కిశోర బాలికలకు రోషగార లోపాలు తగ్గించడానికి ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం పలు అంగన్వాడి కేంద్రాలకు 16 మంది గర్భిణీ స్త్రీలకు ఘనంగా సీమంతం నిర్వహించారు. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏవో స్వర్ణ,లింగగిరి పిహెచ్సి డాక్టర్ వేణుగోపాల్,పోషన్ అభియన్ బీసీ రాజేష్, విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సోనేర్,అంగన్వాడీ టీచర్స్,ఆయాలు, తదితరులు,పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు